ఓలమ్మ మా 'అమ్మ'...

 

నడినెత్తిన సూరీడు నాట్యమాడెను...ఓలమ్మ ఓయమ్మ...
చెంగు చెంగున నీవు కొంగే గప్పేవు...ఓలమ్మ ఓయమ్మ..
 
రివ్వు రివ్వున గాలి..జివ్వు జివ్వున వాన...ఓలమ్మ ఓయమ్మ..
పరుగు పరుగున నీవు గూటికి చేర్చేవు...ఓలమ్మ ఓయమ్మ..
 
ఆట పాటలతోటి అలరించి పెంచేవు...ఓలమ్మ ఓయమ్మ..
ఆ చిన్నవాని చిరునవ్వుకు మైమరిచి పోయేవు...ఓలమ్మ ఓయమ్మ..
 
జోరమోచ్చినాదని కలత చెంది మందు గుళిక వేసేవు...ఓలమ్మ ఓయమ్మ..
ఆ కలతలే నీ బిడ్డకు శ్రీ రామరక్షమ్మ...ఓలమ్మ ఓయమ్మ..
 
మొక్కులు మొక్కి ముడుపులే కట్టేవు...ఓలమ్మ ఓయమ్మ..
ఆ మొక్కవోని దీక్ష నీకేక్కడిది...ఓలమ్మ మా 'అమ్మ'...
 
 

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!