ఓషో

ఓషో
జన్మించలేదు
మరణించలేదు
ఆయన ఈ లోకాన్ని
డెసెంబర్11,1931 నుండి
జనవరి 19,1990 మద్యకాలంలో
సందర్శించారు.


 

 

ఈ జగతిని నలుమూలలా ఎంతో మంది తమ భావజాలంతో పరిపుష్టం చేసారు, మానవ జాతికి దిశానిర్దేశం చేసారు. వారిలో శాస్త్రవేత్తలూ, కవులూ, దార్శనికులూ, తత్వవేత్తలు, వగైరా వగైరా..
రజినీష్ చంద్రమోహన్ జైన్ (డిసెంబరు 11, 1931 - జనవరి 19, 1990). 1960లలో ఆచార్య రజినీష్‌గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్‌గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్‌మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశారు. ఇతడు మధ్యప్రదేశ్‌లో గల నర్సింగ్‌పూర్ జిల్లాలో ఉన్న కుచ్‌వాడాలో జన్మించారు.


అరవైలలో తరుచుగా శృంగారానికి సంబంధించిన ప్రవచనాలను వెలువరించినందుకు ఆయన్ని "సెక్స్ గురువు" అని పిలిచేవారు. ఆ ప్రవచనాలన్నింటిని Sex to Superconsciousness అనే ఆంగ్ల పుస్తకంగా ప్రచురించారు, ఈ పుస్తకం సంబోగం నుండి సమాధి వరకు అనే పేరుతో తెలుగులో అనువదించబడినది. ఆయన చెప్పినది, "తంత్ర పద్ధతిలో అనైతికం అనేది లేదు, అంతా నైతికమే" సెక్స్‌ను నైతికంగా అణగద్రొక్కడం లాభ రహితం, సంపూర్ణంగా చైతన్యసహితంగా అనుభవించనప్పుడు దాన్ని దాటి ముందుకు వెళ్ళలేరు అని.
ప్రతి ఏటా 2,00,000 మంది పర్యాటకులతో, పూణే పట్టణములోని ఓషో అంతర్జాతీయ ధ్యాన విహారము (Osho International Meditation Resort) ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక ఆరామాలలో ఒకటి
కొత్త ఢిల్లీలోని భారత పార్లమెంటు గ్రంధాలయంలో కేవలం ఇద్దరు ప్రముఖుల పూర్తి జీవితకాల రచనలను మాత్రమే పొందుపరిచారు, ఒకరు ఓషో కాగా మరొకరు మహాత్మా గాంధీ.


ఇక ఓషో బోధలన్నీ, దాదాపుగా, సమాజంలో శతాబ్దాల తరబడి పాతుకుని ఉన్న విలువలను ప్రశ్నించేవిగా ఉంటాయి. మతం, పవిత్ర గ్రంథాలు, సమాజంలో గొప్ప గా చూడబడే వ్యక్తులు (గాంధీ, వినోభా భావే, మదర్ తెరిస్సా, శంకరాచార్యులు, ఇతర వర్గానికి చెందిన సన్యాసులు వగైరా), సమాజంలో గౌరవంగా, ఆదర్శంగా చూడబడే విలువలు (పెళ్ళి, ఆచార వ్యవహారాలు వగైర), వీటన్నిటిని ప్రశ్ని౦చడం, సమాన్యులెవరూ ఊహించని విధంగా విశ్లేషించడం, ఈ శతాబ్దంలో ఒక్క ఓషో కే చెల్లింది.


తన జీవన విధానం కూడా అలాగే ఉంటుంది. 99 రోల్స్ రాయస్ కార్లు, పుణే లో అత్యంత ఆధునికమైన ఓ ఆశ్రమం, ప్రపంచం నలుమూలలా శిష్యులు, కానీ, ఆఖరు రోజుల్లో, ఇమ్మిగ్రేషన్ సూత్రాలను ఉల్లంఘించాడన్న నేరంపై అమెరికా లో నిర్బంధితుడు అయి, అక్కడే తనపై విషప్రయోగం జరిగి, ఆ తరువాత ప్రపంచంలో 25 దేశాలు తనకు వీసాలు నిరాకరించి, చివరి రోజుల్లో పుణే లోని తన ఆశ్రమంలోనే మరణం చె౦దారు...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!