ఇచ్చాను ప్రేమ లేఖ...

ఇచ్చాను ప్రేమ లేఖ దాచుకోలేక
చేసింది ముక్కలు తనకిష్టంలేక...

ఇచ్చాను గులాబి నేనుండలేక
పెట్టింది చీవాట్లు ముళ్ళుంది గనుక...

ఇచ్చాను లిటిల్ హార్ట్స్ బడ్జెట్ లేక
కాలింది తనకు ఆ గిఫ్ట్ చూశాక...

తాకాను తనని ఏదోతెలియక
చూసింది చూపు ఏం చేయాలో తెలియక...

అడిగాను ముద్దు ఆపుకోలేక
తీసింది చెప్పు చెప్పనే చెప్పక...


Comments

Post New Comment


Nemali Kunche 16th May 2011 05:12:AM

మీ కవితను చదివిన తరువాత 5 నిమిషాలు నవ్వుకున్నాను...Excellent concept and wording also...