మల్లాది వెంకటకృష్ణమూర్తి ..కథాకేళి 1

మల్లాది వెంకటకృష్ణమూర్తి 'కథాకేళి' 1991 లో మొదటి ప్రచురణ..మల్లాది గారి కథాకేళి అనే  కథ సంకలనంలో ప్రచుదించిన కథలన్నీ తొలుత వివిధ పత్రికల్లో వచ్చినవే.... ఈ కథాకేళి లో 80 కధలు ఉన్నాయి. ఈ కథలన్నీ కప్పు కాఫీ తాగేలోగా చదివేయగలం, ఈ కథలను చదివాక, మల్లాది వెంకటకృష్ణమూర్తి 'కథాకేళి' పుస్తకం లోని 600 మాటలు  మించని మిగతా కథలకోసం తప్పక ఆరాటపడతారని ఆశిస్తూ .... ఈ కధలు మీ కోసం....

కోరిక....


"ఇది సింపుల్ గేమ్ . మన స్కూటర్ తాళం చేవులన్నీ ఓ డబ్బాలో పోసి బాగా కలుపుతాం. ప్రతి ఆటగాడు తన చేతికి వచ్చిన తాళం చెవిని తీసుకుంటాడు. ఎవరి స్కూటర్ తాళంచెవి వస్తే ఆ స్కూటర్ యజమాని భార్య ఆ రోజంతా అతనితో గడపాలి. ఇలా పన్నెండు మంది స్కూటరిస్ట్ ల భార్యలు, తమ భర్తతో కాక ఇంకొకరితో గడపాల్సి ఉంటుంది.... "వైఫ్ స్వాపింగ్ " అంటారు దీన్ని" పశుపతినాథ్ కి చెప్పాడు, అతని మిత్రుడు యతిరాజ్.

"నువ్వు ఇందులో పాల్గోన్నావా?" అడిగాడు కొత్తగా ఢిల్లీ బదిలీ అయి వచ్చిన పశుపతినాథ్.

"చాలా సార్లు తమాషాగా, ఎక్సైటింగ్ గా ఉంటుందా ఆట. ఎవరికీ ఎవరు దొరుకుతారో అన్న ఉత్కంఠ అనుభవించి తీరాలి.అయితే ఈ ఆటలో ముఖ్యమైన విషయం...వల్ల మద్య ఏం జరిగిందో ఇతరులకి చెప్పకూడదు. మరోసారి రహస్యంగా వాళ్లిద్దరూ కలుసుకోకూడదు.ఇట్సాల్  ఫర్ ఫన్! ఆలోచించండి.

ముందు ఆ విషయం గురించి మాట్లాడడానికే భయపడ్డాడు పశుపతినాథ్, కానీ లండన్ లో రెండేళ్లు చదివి వచ్చిన మిసెస్ పశుపతినాథ్ కి చెప్పాడు. ఆమె ఒప్పుకుంది. ఆ విషయం యతిరాజ్ కి ఫోన్ చేసి చెప్పాడు. సరిగ్గా రాత్రి ఎడున్నరకి యిద్దరూ తమ స్కూటర్ మీద యతిరాజ్ ఇంటికి వెళ్ళారు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా ముప్పై ఇదు లోపు వాళ్ళే, అందరి భార్యలు ఇంగ్లీషు మాట్లాడగలరు. అంతా మిసెస్ పశుపతినాథ్ భార్య వంక ఆసక్తిగా చూసారు. అందరితో పాటు తన స్కూటర్ తాళం చెవిని కూడా ఓ డబ్బాలో వేసాడు పశుపతినాథ్, డబ్బా బాగా కలిపాక చెప్పాడు యతిరాజ్.

"మొదటిసారి కాబట్టి మొదటి అవకాశ౦ నీది"

పశుపతినాథ్ ఆ డబ్బాలో నుండీ ఒక తాళంచెవి తీసాడు......అది యతిరాజ్ దే.
ఒప్పందం ప్రకారం యతిరాజ్ భార్యని తీసుకొని పశుపతినాథ్ తన ఇంటికి బయలుదేరాడు.దారిలో అతని మనసు నిండా రకరకాల ఊహలు, కోరికలు, 'వాటిలో కొన్ని అయినా తీరితే' ఆ ఊహకే అతనికి పులకరింతగా ఉంది. తన భార్య దర్శన్ సింగ్ తో అతనింటికి వెళ్ళింది. అక్కడ ఏమవుతుందో అన్న ఆలోచన రాలేదు పశుపతినాథ్ కి.

ఇంటికి చేరుకున్నాక తలుపు తీసి లోపలికెళ్ళి చెప్పాడు మిసెస్ యతిరాజ్ తో గౌరవంగా....
"రండి"
ఆమె లోపలికి వచ్చి, అతనికి ఆనుకొని నిలబడి చిన్నగా నవ్వింది. ఆమె వంటి మీద రోజ్ వాసన వస్తుంది.
"మన ఒప్పందం ప్రకారం నేనేం అడిగినా మీరు చెయ్యాలి అవునా?" అడిగాడు పశుపతినాథ్ చొక్కా గుండీలు చక చకా విప్పుతూ.
మిసెస్ యతిరాజ్ కొద్దిగా సిగ్గుపడింది అతను చొక్కా విప్పడం చూసి.
"అవును తీరని మీ కోరికలు తీర్చడానికే వచ్చాను" చెప్పింది.
" అయితే ఈ చొక్కాకి లూస్ గా ఉన్న బటన్స్ కుట్టండి. మా ఇల్లు కూడా మీ ఇల్లంత నీట్ గా సర్దండి. నాకు ఇష్టమైన కంది పచ్చడి, బీన్స్ పాటోలి, వంకాయ కాల్చి పచ్చడి, ఇంకా గంటలో మా పిల్లలు వస్తారు, వాళ్ళతో హోమ్ వర్క్ చేయించండి. ఇంటికి బూజులు దులిపి, పిల్లలు క్రేయాన్స్ తో గోడల మీద గీసిన బొమ్మలు చెరిపేయండి. మీ ఇంట్లో లాగా ఇంటి వెనుక మా మొక్కలన్నిటికీ పాదులు చేయండి, మీ ఇంట్లో ఉన్నలాంటి ప్లాస్టిక్ వైరుతో అల్లిన పూలసజ్జ ఒకటి అల్లి పెట్టండి. ఇవన్ని అయ్యాక కూడా మీకు నిద్రరాకపోతే నాకు ఓ మిల్స్ అండ్ బూన్ నవల చదివి వినిపించండి. ఇవన్నీ నా భార్య ద్వారా చాలా కాలంగా తీరని కోరికలు" చెప్పాడు పశుపతినాథ్ ఆనందంగా!


అర్ధరాత్రి అతిథి..

"మా అమ్మ ఆరోగ్యం ఏమాత్రం బాగున్నా ఎల్లుండి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తానండి. మీరు రాత్రిళ్ళు బయట తిరగకుండా త్వరగా ఇంటికి వెళ్ళండి" చెప్పింది విశ్వామిత్ర భార్య అతనితో.
" అలాగే! టెలిగ్రాం ఇవ్వలేదు. ఊరికే లెటర్ రాశారంటే సీరియస్ అయివుండదు" తన భార్యకి ధ్యైర్యం చెప్పాడు విశ్వామిత్ర.
బస్సు మరో అయిదు నిమిషాల్లో బయలుదేరింది. బయటకి వచ్చిన విశ్వామిత్ర ఇంటికి వెళ్ళలేదు. దగ్గరే ఉన్న ఓ సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి, హోటల్ లో భోజనం చేశాక ఇంటికెళ్ళాడు.
రోజు భార్యతో గడిపే పక్కమీద వంటరిగా గడపాలంటే అతనికి వెలితిగా ఉంది. నిద్ర వచ్చేదాకా 'ఇండియా టు డే ' చదివాడు.
కాలింగ్ బెల్ చప్పుడికి అతనికి మెలుకువ వచ్చింది. తను లైటార్పకుండానే నిద్రపోయాడని గ్రహించాడు. వాల్ క్లాక్ వంక చూసాడు -- పదకొండూ ఇరవై, ఇంత రాత్రివేళ ఎవరొస్తారు?..లేచి వెళ్ళి తలుపు తీసేలోగా ఇంకోసారి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే అవతల ఓ ముప్పై ఏళ్ళ యువతి నించొని ఉంది.
"ఎవరు కావాలి?" అడిగాడు విశ్వామిత్ర.
"విశ్వామిత్రగారు మీరేనా?" అడిగింది.
"అవును. మీరు.....?"
"ముందు లోపలికి రానివ్వండి."
సందేహిస్తూ పక్కకి తప్పుకున్నాడు విశ్వామిత్ర. ఆమెని అంతకు మునుపెన్నడూ చూడలేదు అతను.
"నా పేరు మేనక" నవ్వింది.
తెల్లబోతూ చూస్తున్న అతనితో చెప్పింది.
"నిజం తమాషాకి చెప్పడం లేదు నేను. మీ భార్య ఇంట్లో లేదా?" అడిగింది మేనక.
"ఊరెళ్ళింది ఇంతకీ మీరెవరు?" అడిగాడు విశ్వామిత్ర.
"చెప్తాగాని, లోపలికి వెళదాం పదండి" తలుపు మూసేసింది మేనక.
"ఇంట్లో నేను తప్ప ఇంకెవరూ లేరు....." చెప్పాడు విశ్వామిత్ర ఇబ్బందిగా చూస్తూ.
"నాకు తెలుసాసంగతి."
"మీ ఉద్దేశం ఏమిటో నా కర్ధం కావడం లేడు" సీరియస్ గా  చూస్తూ చెప్పాడు.
"నా ఉద్దేశం అంటే."
అతని మెడ చుట్టూ చేతులు వేసి విశ్వామిత్రని ముద్దు పెట్టుకుంది.
విశ్వామిత్ర ఆమెని విడిపించుకోవాలనుకున్నాడు. కానీ ఆమె వదల లేదు. కొద్ది నిమిషాల్లో అతను ప్రతిఘటించడం మానేశాడు. ఇద్దరూ బెడ్ రూమ్ లోకి వెళ్ళారు.
అరగంట తర్వాత మేనక లేచి గ్లాసులోకి మంచినీళ్ళు వంచుకుని తాగి చెప్పింది తృప్తిగా.
"ఊహకే తప్ప నా కింత తెగింపు వుంటుందనుకోలేదు."
"మీరెవరో చెప్పనేలేదు నాకు?" అడిగాడు విశ్వామిత్ర.
వెంటనే మేనక మోహంలో విషాదఛాయలు అలముకున్నాయి.
"నా భర్త పేరు చెప్పినా మీకు తెలీదు. ఆయన హెచ్.ఎం.టి.లో పనిచేస్తున్నాడు. దాదాపు సంవత్సరంగా సాగుతోంది. ఆయనకీ, మరో అమ్మాయికీ మధ్య ప్రణయం."
"అలాగా కానీ నా పేరు ఎలా తెలుసు?"
"చెప్తాను. నా భర్త నాకు చేసే అన్యాయానికి నా మనసు వుడికిపోసాగింది. ఆయన్ని వారించి ప్రయోజనం లేకపోయింది. ఈ బాధతో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది కూడా, చివరికి పరిష్కారంగా నేను ఆయన చేసే తప్పు చేస్తే నా మనసుకి ఉపశమనం లభిస్తుందనిపించింది. రెండు నెలలుగా ఆలోచించి, ఆలోచించి ఈ రాత్రి ఆ ధైర్యం చేసాను. నా భర్త నాకు చేసే అన్యాయం ఆయనకీ చేసాను. నా కిప్పుడు ఎంతో శాంతిగా ఉంది."
"ఇంతకీ మీ భర్తకి ఎవరితో ఆ అక్రమసంబంధం?" అడిగాడు విశ్వామిత్ర ఆశక్తిగా.
"మీ ఆవిడతో."
"వ్వాట్!" అదిరిపడ్డాడు విశ్వామిత్ర.
"అవును మీరనుకున్నట్టు ఆవిడ గోపాలపురం వెళ్లడం లేడు. బస్సులోంచి మధ్యలో దిగిపోయింది. మా వారు నాతో ఈ రోజు నైట్ డ్యూటి అని అబద్దం ఆడారు. మీ ఆవిడా రాసిన ఉత్తరం నా కంట బడడంతో నాకీ నిజం తెలిసింది. నా కిప్పుడు మనశ్శాంతిగా ఉంది......వెళ్ళొస్తాను" మేనక బయటికి నడిచింది.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!