ఘల్లనుచు తిరిగేవు ఓ మాధవా...

ఘల్లనుచు తిరిగేవు ఓ మాధవా

నీకు ఎల్లలే లేవయ్య ఓ మాధవ

 

కాళింగుని తలల పైన ఓ మాధవా

నీవు నాట్యమే చేసేవు ఓ మాధవ

గోవులను కాచి ఓ మాధవా

నీవు గోపాలకుడవయ్యావు  ఓ మాధవ

 

బృంధావనాన ఓ మాధవా

నీవు ముచ్చటలు గోలిపేవు రాధతో ఓ మాధవ

గోవర్ధన గిరి ఎత్తి ఓ మాధవా

నీవు మా ఇలవేల్పు వయ్యావు ఓ మాధవ

 

ఉట్టి మీద వెన్న తిని ఓ మాధవా

నీవు కయ్యాలే పెట్టేవు ఓ మాధవ

లోకాలనేలేటి ఓ మాధవా

నా ఆత్మాను లోకమేలు ఓ మాధవ

 

కన్నీటి సంద్రాన ఓ మాధవా

నా కనుచూపు మేర లేవ ఓ మాధవ

తలచినా చాలంటివి ఓ మాధవా

నీ పిలుపుకే నే వేచియుంటి ఓ మాధ

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!