నువ్వు...
నువ్వు ఎంత అందంగా ఉంటావు అడిగితే,.... ఆకాశాన్ని చూపిస్తాను .....
నీలో కల్మషాన్ని చూపించమన్నపుడు ,.... గుడిలో హారతిని చూపిస్తాను,....
నీ స్వరం వినాలన్నపుడు ,......సెలయేరు హోరులో గుడిగంటల రాగాన్ని కోయిల కొంతులో వినాలంటాను,.....
మరీ ఎవరైనా నా గురించి అడిగితే ............ఏమో..........
..........................................నిన్ను చూపిస్తున్నాను
- నరేన్
కాలం...
గడచినా ప్రతిక్షణం జ్ఞాపకమవ్వాలి
ముందున్న ప్రతిక్షణం సార్దాకమవ్వాలి,
అందుకు .....................................
ఈ క్షణం నిన్నే తలచుకోవాలి ...........
- నరేన్
అతిశయం...
1. నిన్ను చూసిన తొలిక్షణం
2. నీ తొలిపరిచయం
3. నీతో మాట్లాడడం
4. నా స్నేహాన్ని అంగీకరించడం
5. దేవకన్య లాంటి నీ సౌందర్యం
6. నీ ప్రేమను పొందిన నేను
7. నాలో నిండిన నీవు
ప్రపంచంలో నాకు తెలిసిన ఏడు అతిశయాలు.
-నరేన్