నిను చేరాలని...

ఆకాశం మేఘావృతం... వర్షం వచ్చివెళ్ళిన వేళ
నీవు నదీ తీరాన... కళ్ళల్లో నాకై నీరీక్షణ... ఆకులపై నీటిబిందువుల జ్ఞాపకం...
వెలసిన వర్షపుచినుకులు నీ ప్రియుడేడని వెక్కిరిస్తున్న క్షణాన...
ఉరుములు  ఆ చినుకులను మందలిస్తూ ఒక మెరుపు కాంతిలో నన్ను చూపిస్తే...
నీ వెనుకనున్న నన్ను గుర్తించావు...
నీ కురులలో పూల సుగంధాలను ఆస్వాదిస్తూ... వెనుకనుంచి మునివేళ్ళతో నిను తాకుతూ...
నీ సన్నని వేడపై సుతారంగా ముద్దాడువేళ ...ఆ ఉరుముల అలజడిలో ఉలిక్కిపడి లేవబోయి...
ఈ ఎడబాటు సహించలేక మళ్లీ నిద్రిస్తున్నా... కలలోని నా కవిత నిను చేరాలని...

- - నరేన్


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!