నీ తలపు దూరమయితే...

సుతిమెత్తని మల్లెలు తాకి నీ చెక్కిలి ఎర్రబడితే,
నీ సుకుమారాన్ని పొగడడానికి నాకు పదాలు దొరక్కపోతే...

నా చిలిపి చేష్టలకు నను ముద్దుగా తిడుతుంటే,
సరికొత్త స్వరాలు నీ మాటల తడబాటులో నేను వెదికితే...

నాకు అందని ఎత్తులో నువుంటే,
నా చెంత నిను వూహించుకుని మది సంబరపడుతుంటే...

ప్రపంచం నను పిచ్చివాడినంటుంది,
నీ తలపు దూరమయితే అదే నిజమవుతుంది...

-నరేన్

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!