ప్రేమను చెప్పాలి..

ఎందుకో ఎదసవ్వడి భయంగొలుపుతుంది,
ప్రేమని తెలిపే క్షణం ఇంత కఠినంగా ఉంటుంది,
చెప్పే ధైర్యం సన్నగిల్లి ప్రాణం పోయినట్టుంటుంది,
మనసు వెర్రెక్కి పోతుంది, లోకం వింతగా చూస్తుంది,....
కానీ,
వూహాల్లో నా ప్రపంచం ఎంతో అందంగా ఉంటుంది,
పూవుల్లో తేనె నేలని తాకి సెలయేరయినట్టు,
ఆ సెలయేటిలో ప్రేమ తామరలు వికసించినట్టు,
వాటిలో నీకోసం నేను వెదికినట్టు,
వెన్నెల కుంభవృష్టిలా కురిసి నేను తడిసినట్టు,
కోయిలలన్నీ ఒకచోట చేరి ఒకే లయలో పాడుతున్నట్టు,
పాల సముద్రం పొంగి నన్ను ముంచినట్టు ,
లేచి చూస్తే నీ ఎదపై నిద్రిస్తున్నట్టు,....
నిజానికి నీకు ప్రేమను తెలుపలేక బ్రతుకుతో పోరాడుతున్నాను,
ఇంత అందాన్ని వీడలేక కలలో కలలు కంటున్నాను.
...
కలలే బాగుంటాయి కదా!
.
-నరేన్

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!