నాకు నచ్చిన బ్లాగ్స్ .....

నాకు నచ్చిన బ్లాగ్స్ .....
2  సంవత్సరాల కిందటి సంగతి . నేను బెంగళూరు లో పని చేసేప్పుడు , ఎప్పుడైనా ఖాళిగా ఉంటె ఇంటర్నెట్ మీద పడి కొత్త వాటి కోసం వెతుకుతూ ఉండే వాడిని. అందులో చాలా వెతికే వాడిని మ్యూజిక్ , గేమ్స్ , కొత్త కొత్త locations  , పాటల పల్లవులు . ఓ సారి ఏదో తెలుగు లో కనిపించింది. తెలుగంటే ఎందుకో తెలీదు కాని నాది అన్న భావన ఉంటుంది. చదవడం మొదలు పెట్టా. సరదాగా స్థాయి నుంచి హమ్మ బాబోయ్ నా వల్ల కాదు నవ్వడం అనే స్థాయికి తీసుకెళ్ళింది. అది ఒక 'బ్లాగ్'. దాని పేరు రెండు రెళ్ళ ఆరు. రాసింది తోట రాముడు అలియాస్ గౌతం.నా చేత అన్ని ఆర్టికల్స్ చదివిన్చేసాడు. ఓ రకం గ చెప్పాలంటే నేను అభిమాని  అయిపోయా...అక్కడ మొదలైన బ్లాగ్ వెతుకులాట ,ఎంతో మంది ప్రముఖుల్ని , అలా రాస్తూ ప్రాముఖ్యత సంపాదించినా వాళ్ళని అందించింది. ఈ ప్రాసెస్ లో నేను కూడా ఓ బ్లాగ్ మొదలెట్టా.  దాని గురించి వద్దు కాని , నాకు తెల్సినవి ఇక్కడ చెప్తా వీలైతే పంచుకోండి.
మారుతీయం -- రాసేది ప్రముఖ నటుడు, రచయిత, విశ్లేషకుడు అయిన గొల్లపూడి మారుతీ రావు గారు.
రెండు రెళ్ళ ఆరు-- గౌతం
సాహితి అభిమాని , మన చందమామ - ప్రసాద్ గారు.
వీర తాళ్ళు
వికటకవి
మనసులో మాట
మన చలం
బ్లాగాడిస్తా
నెమలి కన్ను
కూడలి -- ఇది చాల బ్లాగుల సమ్మేళనం
సాంగ్స్ lyrics
rare e books
ఆంధ్ర ప్రదేశ్ మీడియా కబుర్లు
పర్ణశాల
నాన్న
నవ తరంగం
చదువరి
కొత్త పాళి
కలగూర గంప
ఇంకా వెతికితే చాల ఉన్నాయే.. మీ ఓపిక ..
ఇవి కాకుండా కౌముది online తెలుగు పత్రిక...MBS ప్రసాద్ గారి columns from GREATANDHRA . com .
ప్రసాద్ గారి columns చాలా బాగుంటాయి. తప్పకుండ చదవండి.
ఇప్పటికి ఇంతే . కొత్త సమాచారం తో మళ్ళి కలుస్తా.
 
 

Comments

Post New Comment


Rama Devi 11th Jun 2011 06:27:AM

నిజం మనసు అడుగున ఉన్నంతవరకే మనుగడ పెదవి దాటితే  ఇలాంటివి తప్పవేమో..ఈ కథలోని ప్రసన్న లాంటి వారు  ప్రతి ఇంట్లోను ఉంటారు... ఈ కథలో తనను పట్టిచుకోండి అంటూ  చేసిన తిరుగుబాటు  అందరి దృష్టిలో పిచ్చి,,,యిలా  తిరుగుబాటు చేయాలి అని ఆలోచన రాని వాళ్ళు కోకొల్లలు...వాళ్ళకు మనం ఇచ్చే బిరుదులు చాలానే ఉంటాయి..thank you for your story naresh...