మధుబాబు

నాకు పుస్తకాలు ఎలా అలవాటయ్యాయో గుర్తు లేదు కాని, మా తాతయ్య దగ్గరకి వెళ్ళినప్పుడు ఆయన చెక్కపెట్టెలో దాచిన పుస్తకాలు  చిన్న novels తీసి చదవడం మాత్రం గుర్తుంది. ఇవే కాకుండా 'ఈనాడు' తో వచ్చే ఆదివారం పుస్తకం. అందులో వచ్చే phantam కథలు. ఇంకా చెప్పుకోవాల్సింది అందరికి తెల్సిన 'చందమామ'. అందులో బొమ్మలు. అందులో రాజులూ, రాణి,మాంత్రికుడు,పర్వత సాణువులు, చీమలు దూరని కారడవులు..అబ్బో చాలానే ఉండేవి.ఇప్పటికి కూడా అవంటే చాలా ఇష్టం.
 
నేను 8th లో ఉండగా నాకు బెల్లం రవి పరిచయం అయ్యాడు. వాడికి కూడా ఇవే ఇష్టం. వాళ్ళ ఇంటికి ప్రతి నెల చందమామ వచ్చేది. ఇందుకోసమే వాడితో నాకు స్నేహం కుదిరింది. కొత్తగా వచ్చేవి కాకుండా పాతవి కూడా తెప్పించుకుని చదివే వాడిని. నా దగ్గర మా తాతయ్య దగ్గర తెచ్చిన detective novels ఉండేవి. అందులో హీరో 'షాడో', షాడో స్నేహితుడు 'గంగారాం'. భారత దేశాన్ని వణికించిన ఒక గజ దొంగ, ప్రభుత్వ secret service లో చేరి ఏమేం సాహసాలు చేసాడు అనేది దీని ఇతివృత్తం. 10th కి వచ్చిందాకా క్లాసు జరుగుతున్నా సరే  పుస్తకాల మధ్యలో పెట్టుకొని మరి చదివేవాళ్ళం. 10th అయాక ఆ అవకాశం రాలేదు. ఈ పుస్తకాలు చదివి నేను పాడైపోతనేమో అని మా అమ్మ నాన్నల భయం. అందుకే ఈ విషయంలో నన్ను తిడుతూ ఉండేవాళ్ళు 'ఎప్పుడు చూడు ఈ పిచ్చి కథలు ' అని.ఎందుకో నాకవంటే నిజంగా పిచ్చే.
ఇంటర్ అయ్యాక హైదరాబాద్ వచ్చేశా. హాస్టల్ లో ఉండగా 'స్వాతి' లో ఏదో సీరియల్ వస్తూఉంది. దాని పేరు 'కాళికాలయం' (మీకు వీలైతే ఈ పుస్తకం చదవండి.). కొన్ని ఎపిసోడ్స్ చదివాక మరి పిచ్చి పెరిగి,ఆ పుస్తకం కొన్నాను.ఇది రాసింది 'మధు బాబు'. ఈయనే 'షాడో' series రాసింది. ఈయన ఏలూరు దగ్గర ఉన్న హనుమాన్ జంక్షన్ లో headmaster . మనం సినిమాల్లో హీరో లని హీరొయిన్ లని ఎలా అభిమానిస్తామో అలా అభిమానం పెరిగిపోయింది.ఓ సారి కలిస్తే బాగుండు అని.
 
రోజులు గడుస్తూ ఉన్నాయి .కొన్ని రోజులకి మా లలిత వచ్చింది.మా లలిత ది హనుమాన్ జంక్షన్. మా లలిత కి పెళ్లి కుదిరింది.ఈ లోగ నేను మధు బాబు గారి చాలా పుస్తకాలతో పాటు కాళికాలయం చాలా సార్లు చదవడం చాల మంది చేత చదివించడం జరిగిపోయింది. లలిత పెళ్లి రోజు రానే వచ్చింది. నాది రాత్రి ఉద్యోగం (night  shift ) కావడం చేత, దుర్గ (పలుసాని నాగ దుర్గ ప్రసాద్ రెడ్డి , నా స్నేహితుడు )నేను కలిసి హైదరాబాద్ నుంచి నా బైక్ మీద జంక్షన్ వెళ్ళడానికి తయారయ్యాం . ఉదయం 6 గం లకు బయల్దేరి 12 గం లకు జంక్షన్ కు చేరుకున్నాం.మాకు అక్కడ ఉన్న ఓ హోటల్ లో రూం ఇచ్చారు.ఫ్రెష్ అయి కింద తిరుగుతూ ఉన్నాం.సాయంత్రం అయింది. మా హోటల్ కింద ఉన్న మందుల షాపు దగ్గర ఒకాయన బండి మీద లుంగి కట్టుకుని కూర్చున్నాడు. దగ్గర చూస్తే ఆయన మధు బాబు.అవును షాడో మధు బాబే. కాలం ఆగిపోయి,చిరు జల్లు  ల తో పూల వాన...నా మొహం వెలిగిపోతుంది. నా పక్కన దుర్గ గాడు నన్నో వెర్రి గొర్రె ల చూస్తున్నాడు.ఎం ఫర్లేదు.ఆయన దగ్గర కు వెళ్ళాను. 'సార్, మీరు మధు బాబు గారు కదా?' అని. ఆయన కొంచెం వింతగా చూస్తూ 'అవును ' అన్నారు. వెంటనే నేను 'నా పేరు లక్ష్మీ నరేషు,నేను హైదరాబాద్ నుంచి వచ్చాను' అని చేయి ఇచ్చాను(shake hand).ఆయన కూడా చేయి ఇచ్చారు. ఇంకేం మాటాడలేదు. నేను మాత్రం చేతులు నలుపుకుంటూ,పళ్ళు ఇకిలిస్తూ  అక్కడే నిలబడ్డాను.ఆయనేం పట్టనట్టు ఉండిపోయారు. దుర్గ ఉండి 'ఇక చాలు పదరా ' అన్నాడు. ఆయన్నల చూస్తూ హోటల్ కి వెళ్ళిపోయాను. ఫైనల్ గ నేను మధు బాబు ని చూశానోచ్. హా నా అభిమాన రచయిత,పుస్తకాలంటే నాలో ఇష్టం పెంచిన రచయిత ని చూసాను.చాలా సంతోషమేసింది, ఎంతంటే 9th లో ప్రచారానికి వచ్చిన NTR ని చూసినంత. మధు బాబు పుస్తకాలు కాకుండా యండమూరి,యద్దనపూడి,సూర్యదేవర,చలం ఇంకా కొందరి పుస్తకాలు చదివాను.కాని మధు బాబు గారంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన పుస్తకాలని ఇప్పుడు పిల్లల పుస్తకలంటారు కాని , నేను మాత్రం పిల్లాడి లానే చదువుతాను.
 

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!