వెళ్ళమన్నానా..

వెళ్ళమన్నానా....
Why don't you listen...

నీవు ఎంత మొండివాడివోయ్
వద్దన్న ప్రతిసారి
కొత్త రూపుతో ఎదురుపడతావ్

ఒకసారి జడివానై
మరోసారి కొండగాలై

ఒక్కొక్కసారి
నల్ల నల్లని మబ్బై
రంగుల హరివిల్లై

ప్రతి మలుపులో
నీ ఆనవాలు వెన్నెల ముక్కలై
ఎదురుపడతాయి..

ఓయ్
ఏమంటావ్...
కథ లోని మలుపు
ఇంకా నా చెంతనే
ఉందంటావా....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!