నన్ను దొంగిలించకూడదూ...

సముద్రమంత మాటలు
ఎందుకో కుంచించుపోయి
కనపడకుండా కనుమరుగవ్వాలని
కొత్తదారులు వెతుకుతున్నాయి...

నిశ్శబ్దం ఒకటి చెంత చేరి
నింపాదిగా నన్ను ఆక్రమించుకుంటుంది..

ఓయ్
ఇప్పుడు నీ రాక
మరింత అవసరమైనది...

ఇటు వైపు రారాదు
ఈ నిశ్శబ్దపు మహారాణి ఒడి నుంచి
నన్ను దొంగిలించకూడదూ...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!