నీవు జ్ఞాపకం వచ్చిన క్షణాన
తొలకరి వర్షపు చినుకువే...
అంతలోనే ఎపుడు జడివానగా మారి
నీ జ్ఞాపకాల తుఫానులో
చిక్కుకుపోతానో ... లెక్కతేలదు....
అయినా
వెతికి వెతికి వర్షం వెలిసిన రాత్రిని
అరువు తెచ్చుకుంటాను..
వెన్నెల దుప్పటి అంచున నిన్ను ముడివేసి..
నను వీడని కలను కౌగిలించుకుంటాను..