వెన్నెల ముక్క

I haven't learn yet
to lock you  .....

నీ చెంత నున్న వెన్నెల ముక్క
చేజారి నా చెంత చేరింది
తిరిగి ఇద్దామంటే ....
వేల సంవత్సరాలయింది
నిను కలిసి....

నా అస్తిత్వం
నీ నుండి మంచులా
కరిగిపోయే ఉంటుంది..

చెరిగిన బొమ్మను
సరి చేయడం
మళ్లీ మొదలెట్టనా
మొదటి నుంచి ...

ఓయ్
ఈసారి కాస్తంత
నా వైపు ఉండకూడదా
చిటికెడెంత సాయం చేయ...

మరో మాట
నా వైపు వచ్చాక అచ్చంగా
నువ్వు నాతో ఉండపోరాదూ
అడగాలని ఉంది...

అయినా
నాలుక చివర నుంచి
రాలిపడదుగా

ఏం చేయను....
నిన్ను నా చెంత దాచుకునే విద్య
ఇంకా నేర్చుకోలేదు మరి...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!