నీ మనసు సోయగపు కవిత
నేనై ఉంటే బాగుండని ఎంత కోరికో
ఇష్టానికి కోరికకు మోహపు
అలజడులకి మధ్యన
ఎక్కడ చిక్కుకుపోయానో నీతో
ప్రశ్నలు.. జవాబుల లెక్కలు
సమతూకాలు వేయాలని లేదు
చర్చలు రాద్దాంతాలు
అనంత నిశ్శబ్దాలు
వలకబోయాలని లేదు..
నీవు నాతో ఉన్న క్షణం
నేను నీతో ఉన్న క్షణం
ఒక్కటిగా ఉంటే చాలు...