మరో కలకందాం

నా చెంత నున్న ప్రేమను
అనంత విశ్వంలో వెదజల్లమని
రెక్కలనిచ్చి సాగనంపి

ఖాళీ అయిన మనసుతో
నిశ్శబ్దపు సముద్రపు ఒడ్డున
తనివి తీరా శోకించాలని

పిడికెడు పిడికెడు వేదనను
మనసారా ఆరగించాలని
అలవికాని వేదనను పట్టుచీరగా
అలంకరించుకోవాలని..

సమస్త లోకాల్లోని వేదనంత
జ్ఞాపకము నీడగా 
ఎవరి చెంత మిగలకుండా
నా చెంత చేరి నన్ను అల్లుకోవాలని..

వేదనలో రగిలి రగిలి
నేనన్న ఆనవాలు కరిగి కరిగి ..
చిక్కటి చీకటి గుహలోకి
ముడుచుకున్న నత్త గుల్లవోలె
ఒదిగి ఒదిగిపోవాలని ...
అందని ఓ కల వెంటాడుతుంది
మరి మరి....ఎందుకో ఈవేళ

ఓయ్
నీవు నాతో ఉండిపోరాదు
మరో కలకందాం


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!