ఎలా ఉన్నావోయ్.....

అవునన్నా కాదన్నా... మౌనం రాజ్యాలేలుతున్నా.. మది నాతో వంత పాడుతుంది... మాటలకేం కొదవ లేదోయ్...

ఒంటరిగా ఉన్నాను అనేవేళ జంటగా నువ్వున్నావ్ అనిపిస్తుంది.. నీవు ఉన్నావన్న ఊహ మదికి తాకగానే పట్ట పగలు కూడా ఆకాశం నుండి తారలు తెంపుకురావాలని ఆరాటపడుతుంది.. సముద్రపు అడుగున వెతికి వెతికి పగడపు ముత్యాలను ఏరి తెచ్చి దండగా గుచ్చి మెడలో వేయాలని ఎంత ఆశ పడుతుందో..

ఊహల్లోని నీవు ఆదమరచైనా నా ఎదురుగా రావని తెలిసి తెలిసి మరిచిపోతుంది చూడు..

నాకంటే నీపై మరులుకొని ఆశలు అల్లుకొని ఎదురుచూడడం అంటే మక్కువ ఎక్కువేనోయ్..

ఎన్ని మాటలు చెబితే ఏమిలే నీ అలకల దూరానికి కొలతలు వేయడం నాకు సాధ్యమా...

ఏదేమైనా పట్టుపట్టి గడుసుగా
నా జ్ఞాపకాల గంపను ఖాళీ చేయడం నీ తరమా...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!