ముందుకు వెళుతూ
వెనక్కు తిరిగి చూస్తాను
అతను వస్తున్నాడేమోనని
వెళుతూ వెళుతూ
దారి తప్పానంటూ
వెనక్కు తిరిగి వెళతాను
అతను ఎదురౌతాడేమోనని..
మరింత గడుసుగా
రహదారికి కాపలా కాస్తాను
నన్ను దాటి వెళ్లడం చూద్దామని...
ఏమైనా కాని
మోహపు దారాల వల
మరింత చిక్కగా అల్లుకోడానికి
ఎన్ని కథలైనా సృష్టిస్తాను..