పచ్చగడ్డి తుంపర వాన

పచ్చగడ్డి తుంపర వాన
పాదాలు తడుపుతుంటే
నా చూపులను తాకుతూ
అక్కడక్కడ రాలిపడిన
ఒంటరితనపు ప్రేమలెన్నో...

ఎవరెవరో
ఆదమరిచి వదులుకున్నవి
అనుకోకుండా పారేసుకున్నది
గుంపైన ఒంటరి ప్రేమలు..

కలుస్తూ విడిపోతూ...
ప్రేమలన్నీ మాటలై
సున్నితపు రూపు దాల్చి
నా చెంత చేరాయేమో

ఓయ్
ఉవ్వెత్తున ఎగిసిన ప్రేమ
మది నుండి జాలువారుతూ
కనులను తడిపేస్తుంది....

నిన్ను మరింత ప్రేమించేందుకు
యే దారి అంచులు దొరకక ...
నన్ను నన్నుగా మిగల్చని
ఓ ప్రేమను నీలో నింపాలని ..
మది కొత్తదారులు వెతుకుతుందోయ్


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!