మాటల లెక్కింపు..

మాటలను లెక్కిస్తావ్ ఎందుకు
ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ప్రేమించినట్టు
తక్కువ మాట్లాడితే తక్కువ ఇష్టం
అని బేరీజులు వేస్తావు ఎలా....

మాటల్లో పొందిక అంతుపట్టదా
కళ్ళల్లో మెరుపు నిన్ను చేరదా...

పెదవి మీద చిరునవ్వు
నీ మాటతో అతకబడి
ఉందని గుర్తింపేల రాదు...

నీతో మాట్లాడిన క్షణం
నీదైతే చాలదా..
నీతో లేని క్షణం కూడా
నీదే కావాలని పట్టుబడితే ఎలా...

ఎవరికీ పంచబడని మాటలు
నీవైతే చాలదా...
అందరికీ పంచబడే మాటలు అన్నీ
కావాలంటే ఎలా..

అందరిలో నీవు ఉన్నావని
ఎన్ని మార్లు చెప్పనూ ...
అలకతో ఆమడదూరం పోతే
నేనేం చేయను ...

ఓయ్
నీకు చెప్పాల్సిన మాటలు
రహస్యంగా దాచి పెట్టనా..
అనుకోకుండా ఎదురు పెడితే
తటాల్న నీ వైపు విసిరివెళ్లనా...

ఎంతైనా
కాస్తంత గడిసరిని
ఇంకొంత మొండిదాన్ని
ఏదైనా నీదాన్ని కదా....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!