మనసు మీద ఎందుకో
చిన్న చూపు మనిషికి..
అడగదని.. ఆరడి పెట్టదని
మురిసి... నా నెచ్చలి
అంటూనే
దరిచేరనీయరు ఏమిటో
మది పంతం పట్టి
మౌనం పాటిస్తే...
మనసు బాగా లేదంటూ
కాయానికి కష్టం కలిగించి
ఉరి వేస్తారు మనసుకి...
మనసులోని మాటలు
దాచక .. పంచమని అడిగితే
మదిపై పంతమేలనో...
మనిషికి ఎందుకో
ఇంతటి మంకుపట్టు..