కొత్తగా ప్రేమించొచ్చు

నీకైఎదురు చూస్తూ
ఎన్ని జన్మలెత్తానో
క్షణం ....క్షణం

ఎంత బాగుంది కదా
కొత్తగా ప్రేమించొచ్చు ప్రతిక్షణం

********

నా పెదవిపై తటిల్లున
మెరిసే చిరునవ్వు

నీ జ్ఞాపకాలబుట్ట లోని
ఒక తేనె చుక్క

********

మా ఇంటి వైపు
ఒక నల్లని మబ్బు వచ్చింది

ఫక్కున నవ్వి..
ఏమొయ్ నల్లబడ్డావే అన్నాను

నీలాగే పంతం ఎక్కువ  కాబోలు
నిలువెల్లా తడిపేసి వెళ్ళింది...

********

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!