ఎంతటి రాక్షసినో కదా

అనుకోకుండా నాపై
అదమరచి మాట తూలాడని
నన్ను నొప్పించాడని

అతనిపై చాడీలు
మనసాగక చెబుతాను
మనవారని తలచి

విన్నవారు ఊరుకుంటారా
తూలనాడరా అతన్ని
కఠిన హృదయుడంటూ

అమ్మో...
అతను నా వాడే
సున్నితుడే ..

మాట తూలాక
చిగురుటాకుల వడలిన
అతని మోము
కలనైనా మరవజాలను కదా

అప్పుడప్పుడు 
మతితప్పి అంటాడు
మనసు పడి కాదు

అన్నీ తెలిసి నేను
అతనిపై నిందలు వేయ
గుంపును నొకటి చేరదీస్తి
ఎంతటి రాక్షసినో కదా


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!