అర్థం కాని ప్రేమ

అప్పుడప్పుడు
మాటైనా చెప్పకుండా
ఆచూకీ తెలియని దారిలో
నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్తాడు

అయినా
మదిలోని మమకారం
మరవని జ్ఞాపకం నీవేనంటూ
చల్లగాలితో కబురంపుతాడు

అచ్చంగా
అడవిలోని మృగరాజు
దారి తప్పిన నాకు
ప్రాణబిక్ష పెట్టినట్టు
ఓ అదృష్టరేఖలా ....

అప్పుడప్పుడు
నాకు.......
అర్థం కాని ప్రేమ


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!