సముద్రుడే

అతడు సముద్రుడే
అలకతో వదిలి వచ్చాను
వర్షమై వచ్చి తలుపు తట్టాడు

వదిలి ఉండలేక కాదు
వదులుకోలేక.....❤️

********

పూలకోసం వెళ్ళా
దారంతా రాలిన పూలను చూసా
నువు వచ్చి వెళ్ళావని తెలిసింది

*********

ఎన్ని కాగితపు
పడవలు చేశానో...

వర్షమై వస్తే
కలిసి వెళదామని..

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!