ప్రేమనో ..పంతమో

సువిశాలమైన రహదారి నాకు వదిలి
నీవు ఎక్కడో తప్పిపోయావు

ఎందరెందరో.. ఎవరెవరో
మాట కలుపుతారు
కోరి తెచ్చుకున్న జ్ఞాపకంతో
నీవేనని భ్రమపడత

చిక్కని చీకటి గాఢతలో
నీవు వదలి వెళ్లిన రహదారిని
మరింత ఇరుకుగా మార్చివేసి

నీవు మాత్రమే వచ్చే
ఆలీబాబా కథ లోని
కొండచరియ వాకిలి
మలచాలనుకుంటా ....

అయినా...
ఏది మొదలెట్టను ..

కొత్త భ్రమలు మరింత అతికించుకుంటూ
నీవు వదిలిన దారిలో కనిపించిన
అందరిలో నిన్ను వెతుకుతూ
అణువణువు రాలుతూ
నీ నుండి తప్పిపోవడమే సరైనదనుకుంటా

అల్లిబిల్లి కలల నిండా నువ్వు ఉన్నప్పటికీ
అచ్చంగా నువ్వు ... నా నువ్వు అన్నప్పటికీ

ఎందుకో.. మరి
నాలోని నీతో
ప్రేమనో ..పంతమో...శత్రుత్వమో
అంత చిక్కడం లేదోయ్...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!