పిడికెడు ఆణిముత్యాలు
దోసెడు మబ్బులను
సప్తవర్ణాలతో మేళవించి
నీకై ఓ మనసును
అందిద్దామంటే ..
చిరుగాలి వచ్చి
ఎగిరేసుకు వెళుతూ..
అది అతని మనసే కదా
మరోసారి చేస్తావెందుకంది..
అందరూ
అతని వైపే
నాతో కలుపుకుని..
ఇంతటి
అనురాగపు మృదుత్వం
పనికి రాదోయ్