అతను మర్చిపోయాడు
ఎన్నోసార్లు మరిచిపోతూనే ఉంటాడు
అయినా
ఉగ్గ పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాను
నేను గుర్తుకొచ్చి పలకరించే క్షణం కోసం...
గుర్తుకొచ్చిన క్షణం అంతా నేనేనంటాడు
క్షణం గడిచాక అందరూ నా వాళ్లేనంటాడు
ఆక్షేపించను లేను... క్షమించను లేను
ఎర్రబడిన కన్నులతో యుద్ధం చేయాలనిపిస్తుంది
హింసించి వేధించి గాయపరిచి ఏదేమైనా
కదలని కాలంలా ఎదుట నిలవాలని ఉంది...
తప్పు తప్పంటూ మతి వారిస్తుంది
తప్పుకోలేనని మది ఏడుస్తుంది..
వెలుగు రేఖలు విసిరేసి వచ్చాను
చీకటి తావులు వదిలేసి వచ్చాను
ఓయ్...ఇప్పుడు
నిన్ను వదిలి వెళ్ళినా...
నేను దాక్కునే చోటు ఏది