జ్ఞాపకాల గంప

అతను వీధి మలుపులో
తెలియనట్టే  తప్పుకున్నాడేమో
అతడు వెళ్లినంత మేర
నా చూపులు నీడ అల్లుకుంది

అతన్ని విడివడి ఉండలేని బేలతవం
క్రూరత్వాన్ని చిలకరిస్తూ
మనసుని అపర చాణుక్యున్ని చేసింది

పరుగులు తీసే ప్రేమకు ఉచ్చు బిగించాలని
కలవరపడే మనసుపై చర్నకోలు విసరాలని

కలత నిద్ర లోని కలలకు సమాధి కట్టాలని
జ్ఞాపకాల గంప ఆనవాళ్లు చెరపాలని
ఎన్నో..........ఎన్నెన్నో

కానీ... ఇంతలో
అతని చిరునవ్వు ఎదురురయ్యిందో లేదో
అపస్మారకపు కలత కలలా చెదిరిపోయింది

అంతే..ఒక్కసారిగా
గత జన్మ నుంచి మేల్కొన్నట్టు
మనసు అంతా గులాబీ సోయగం

మళ్ళీ కథ మొదలుపెట్టిన
దగ్గరికి వచ్చి ఆగింది..
విడివడే వీలుపడని

అతని అనురాగపు
వలలో చిక్కుకుపోయాను..
ఏమైనా.......
అతను
నాలోని
నా సగమే కదా......


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!