వేకువఝాము నక్షత్రం

సముద్రంలో నీరు ఇంకి పోయినట్టు
ఒయాసిస్సు కి వరదలు వచ్చినట్టు
అంతులేని ప్రేమ కరిగిపోతుందా...

ఏమో..
మది మదికి ఓ గది కట్టి
చదరంగం ఆడే మనుషులకు
చందమామ కథలా అన్నీ సత్యాలే

అందుకే ఈవేళ
పొద్దుపొడుపు నక్షత్రంగా ఒకరు
వేకువజాము నక్షత్రంగా మరొకరు
ఒకరికొకరు ఎదురు పడకుండా
వినీలాకాశంలో చేరోపక్క...

అయినా చిత్రమే
జ్ఞాపకాల వారిధి కొత్త రంగులు
అద్దుకుంటూనే ఉంది కాబోలు
నీలియాకాశం ఎర్రబడింది...
అచ్చంగా...అతని ఊహాలోని
నా చిరునవ్వులా......
 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!