సాయంకాలం నేను అతను కలిసి విహారానికి వెళ్ళాము
చిరు జల్లుల మాటలు నిలువెల్లా తడుపుతున్నాయి
ఏమయిందో
ఏ పక్క గాలి మా వైపు వీచిందో మరి
దిగుడుబావి అంచున మాటలు రాలిపోయాయి
తడబడిన మాటలు ములకులై గుచ్చుకున్నాయి
జారని కన్నీరు ఆవిరయ్యింది
రాలని రక్తం గడ్డ కట్టింది
అయినా
విసిరిన మాటల ఆనవాళ్లు చెరుపుతూ నేను
చెరగని మరకలకు కొత్త రంగులు అద్దుతూ అతను
ఏమి చేస్తాం.. మేమింతే
అక్కడే... ఎప్పటిలాగే
అతను-నేను.....చెరో పక్క
గిజిగాడు గూడు అల్లుకుంటూ
అందులోనే చిక్కుబడిపోతూ..