వదిలివెళ్ళిన జ్ఞాపకం

దారి తెలియని  విరబూసిన అడవిలోకి
అనుకోని అంతులేని  ప్రయాణంలో

వదిలేసిన ఒంటరిలా
కనిపించిందో సన్నని కాలిబాట

అదిగో.. అక్కడే
చేజారిపోయిన కాలిపట్టీ
ఓ రాలిపోయిన గులాబీ
వదిలివెళ్ళిన జ్ఞాపకం
ఓ చిరునవ్వుల సంతకం

అయినా  ఎందుకో
నేను వెనుతిరిగి చూసింది లేదు
వెతుక్కుంటూ వచ్చిందే లేదు

నాకు తెలుసు  ఆ దారి వెంట
నువ్వు అడుగు కలుపుతావని
నీవు అవునన్నా ..కాదన్న
నీ నీడలో ఒదిగిన ఓ నిజం నేనని..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!