జ్ఞాపకం ....నీ జ్ఞాపకం

కరువు నేల పైన
కల్లాపి చల్లి వెళ్ళింది 
జ్ఞాపకం ....నీ జ్ఞాపకం...

*************************(5/10/2021)

నాలోని నన్ను బంధించే
మాట... నీ జ్ఞాపకమై
కలవరపెడుతుంది
కలగా మారి....

************************(12/10/2021)

స్వప్నాలు వెతుక్కునే దారిలో
ఎన్నో మలుపులు

ప్రతీ మలుపులో
అతిదగ్గరగా నువ్వే....

అందనంత దూరంలో.. 
ఆకాశమంత నువ్వే..

******************************(8/11/2021)
 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!