ఓ జ్ఞాపకం-పరిచయం (మినీ కవితలు)

అతను
ఆమెకు
ఓ జ్ఞాపకం....

ఆమె జ్ఞాపకం
అతనికి
ఓ రహస్యం....

**************

మనసునిండా గుబులుతో
నిను గుర్తించలేనేమో
అయినా
నేను నీకు ఎరికే కదా
పలకరించకుండ 
పోమాక...
 
*******************
 
పలుమార్లు
ఒకరికొకరం  ఎదురయ్యాం
 
బహుశా
పలకరించుకోలేదు.. కాబోలు
 
అందుకే
పరిచయస్థులం  కాలేదు
 
*********************
 
నాకు దూరంగా నువ్వు
నీకు దగ్గరగా నేను
సంద్రంలోని నీడలా.....
 
************************
 
ఎందుకు ఈవేళ
కాగితపు పడవ చేయ మనశాయే
బహుశా.....
బాల్యపు గురుతులు
చెరిగిపోతాయి అనే భయం కాబోలు..

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!