నేను-ప్రేమ-జీవితం (మినీ కవితలు)

నీవు ఎదురైతే
ఎన్నో చెప్పాలనుకున్నా...

మనసు గుర్తించకున్నది
మాట రాకున్నది.......

నా జ్ఞాపకంలోని నీ మనసు
మారిందేమో కాబోలు...

***************

నిశ్శబ్దం ఎందుకో
సడి చేయడం 
మొదలెట్టింది...
.
బహుశా..
సరికొత్త సోయగం
అద్దుకోవాలని 
కాబోలు.....
 
*****************
 
రాలిన పూరేకుకి
రంగులద్దాలని...
 
తడి ఆరిన పెదవులకు
పూతేనియలద్దాలని..
 
జ్ఞానం లేని జ్ఞాపకం
పదే పదే విసిగిస్తోంది....
 
***********************
 
నీ కోసం 
పూలదారిని వేసాను...
 
అయినా 
ఎందుకో మరి...
 
మరోదారినే 
ఎన్నుకున్నావు....
 
బహుశా
దాగుడుమూతలు ఆటలో
నా ఆచూకి కనిపెట్టావు కాబోలు...

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!