మినీ కవితలు ( అతను- ప్రేమ)

కనిపించని కాలిపట్టీ కోసం
వెతుకుతూనే ఉన్నా
దాని జాడ తెలిసి కూడా....

********

మనసు  నొచ్చుకుంది

ఎందుకో.......

కాలం పూసిన లేపనంతో
గాడిన పడ్డ జీవితాన్ని చూసి..

*********

కలలు రాని గాఢ నిద్ర
నేస్తమయింది ఈవేళ..

బహుశా

అతని జ్ఞాపకం
మసకబారుతుందేమో..

***************

ఏలనో ఇన్నాళ్లకు
పలుమార్లు పొలమారే.....
 
బహుశా
 
ఇంకా నీ జ్ఞాపకాల్లో
బందీగా ఉన్ననేమో....
 
*********************
అక్షరాల అన్నింటిని ఆరబోసి
నగిషీలు దిద్ది అందంగా అమర్చి
కొత్త పదాలను సృష్టించా...
 
రాయడానికి భావాలే 
కొదవయ్యాయి..
 

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!