జానకి..రాముడు..

ఆజానుబాహుడంటా.. దాశరధ తనయుడంటా
అందాల రాముడంటా.. శివుడివిల్లు విరిచే,
లేత సిగ్గుల సీతను చేపట్టె...

వరమాల చేతబూని, రఘు రామున్ని చూస్తూ
నీ కంటే ముందుపుట్టి, నీ యింటి ఆలినైతి
నా వెంటే నీ వంటూ, అరచేయి చాచేనంట
అందుకోమ్మంటూ  గడసరి సీతమ్మ....

సొగసరి సుకుమారివి నీవు..
నిను వలచిన ధీరుడను నేను..
కాదని నీవంటే, నీ వెంటే నేనంటూ
అడుగు ముందుకేసే అరచేయి అందుకొన
అల్లరి రాముడు...

సిగ్గుదొంతరలతో కలవరపడి ఆ కన్నె..
తడబడే అడుగులతో తండ్రిని చేరే..
చిరునవ్వుతో  జానకి


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!