నేను ఏమి చేయలేనే పిల్లా...నీకై నేనేమి చేయలేనే పిల్లా
నింగికి నిచ్చెన వేయాలేను.. తారల తోరణం కట్టాలేను
జాబిల్లిని సిగలో తురమలేనూ........
మిద్దెలు మేడలు కట్టాలేను పసిడి నగలు వేయాలేను
పందిరిమంచం తేనూలేను మల్లెల పరుపు వేయాలేను
నేను ఏమి చేయలేనే పిల్లా...నీకై నేనేమి చేయలేనే పిల్లా!
నన్ను వదిలి వెళ్ళనంటావ్..నా తోడు ఉంటానంటావ్
నా జత కడతానంటావ్..కోరి నన్ను కోరుకుంటావేలనే పిల్లా
నేను ఏమి చేయనే పిల్లా...నిన్ను నేనేమి అననే పిల్లా!
ఏదో చెపుతావ్ పిల్లా..నువ్వు ఏదేదో చెపుతావ్ మళ్ళా
నా కళ్ళల్లో ప్రేమే చూసానంటావ్..నా మనసే తెలుసంటావ్
నీ నవ్వుకు కారణం 'నేనెరా బావ' అంటావ్
కవితలాగా చెపుతావ్..నన్ను మరిపిస్తావ్..
ఎట్టాగే పిల్ల నీతో.. నేను ఎట్టాగే మళ్ళా