ఉషోదయాన గులాబీ మీద
మంచు బిందువుని చూసినపుడు ......
సంధ్యా సమయాన వెండి వెన్నెల
మెల్లగా నను తాకినపుడు .....
చిరు చినుకుల సరిగమల మధ్య
సెలయేటి పాటల సవ్వడి విన్నపుడు ......
అర్ధరాత్రి కలత నిదురలో
కరిగిపోని కల కదలాడినపుడు.....
నేస్తం......
గుర్తొస్తుంది నీ రూపం
మరపిస్తుంది ఈ లోకం....