అల్లరి మాటలు.. చిలిపి తగాదాలు
అలకలు సాగించిన తీరు.. ఆజ్ఞాపించిన చూపులు
ఏన్నో జ్ఞాపకాలు మరెన్నో చిరునవ్వుల సవ్వడులు
ఆనందంగా గడిచిపొయే కాలం...
తెలియజెప్పకుండానే నను చేరిన మంచుతుఫాను...
అన్నీ మరచి..ఒంటరినేమొనని తలచి
కన్నీరు నా చెక్కిలిని ముద్దాడింది...
అపుడు వచ్చిన నా నేస్తం...
నేనున్నానని చెప్పనూలేదు...చెక్కిలిపై కన్నీరు సృజించనూ లేదు
"ఇలా ఉంటే నువ్వు నాకు నచ్చలేదని"
విసురుగా వెను తిరిగిన తను...
అంతే..............అప్పటినుండి ఇప్పటివరకు...
కనుకొనులలోని కన్నీరు చెక్కిలిని తాకాలని ప్రయత్నించనేలేదు...