నాకోసం రమ్మని అడగలేక
నీకోసం ఉన్నానని చెప్పలేక
కొత్త కథలు చెప్ప నీవు రాక
పాత కథలింకా మర్చిపోలేక
ఏదో
ఒక రోజు ఇక ఆగిపోతానేమో
వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోతానేమో
గంప నిండు జ్ఞాపకాలు పాతపడ్డాయి
కొత్త రంగులద్ద ఇపుడు ఇచ్చలేదు
విదిలించి వేయ మనసు రాదు
నిజంగా
దారే లేని చోటు నిలుచున్నానేమో
నిన్ను పూర్తిగా పోగొట్టుకుంటున్నానేమో
గుబులు గుబులుగా మదినిండుకుంది
ఓయ్
మనసు కాస్తంత మొద్దు బారుతున్నది
ఇక మరింత విసిగించకు
రాకాసి మనసు నిద్ర లేవక ముందే
కాస్త కనిపించి వెళ్ళవోయ్