ఓ...మాట

నది కాస్తంత కలతబారిందట
సముద్రం నిశ్శబ్దంగా దారితప్పిందట
ఆకాశం రెండుగా చీలిందట
అర్థం కాని వాక్యాలేవో మది అంతా అల్లుకుంది

అలజడి జలపాతం కురిసింది
అంతులేని వేదన రగిలింది
మనిషి లేని చోట చేరనేమో
పలకరింపులతోవ తప్పిపోయాను

మనసున ఏదో దురాశ రేగినట్టుంది
ప్రేమించడం కాస్త కొదవ పడ్డట్టుంది
దారి తెన్ను తెలియడం లేదురా

పొంతన కుదరని చింతతో
పొగిలి పొగిలి ఏడుస్తున్నా
పొంగలేని సముద్రంలా

ఓయ్
ఒక్కసారి వచ్చి ఉంటే బాగుండేది
నా తప్పేంలేదని చెప్పి ఉంటే బాగుండేది
కుదిరితే ... ఓసారి వస్తావా


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!