ఒకానొక రోజు
ఆకాశపు అంచున
రాలిన చిన్ని పూవేదో
ఏ నిదుర కలలోనో దాచినట్లు గుర్తు
అయినా కాని
అదెప్పుడు సుకుమారపు
సువర్ణ రంగులద్దుకుందో మరి
ఓహ్....
తిరిగేసే ప్రతీ పుస్తకంలో
నెమలీకై ఎదురుపడుతుంది...
ఓయ్
తప్పిపోయిన నెమలీక కథలు
నాకు చెప్పమాకు
ప్రతిచోటు నాదేనని అనమాకు ...
అసలే నేను
మారువేషంలో ఉన్న రాక్షసిపిల్లని
ఒట్టేసిచెబుతున్నా...తర్వాత కథ అడగమాకు