ఆవైపు నుండి అకాల వర్షంలా
ఎలా ఉన్నావంటూ వినవచ్చిందో మాట...
ఇప్పటివరకు
ఎలా ఉన్నానో ఎందుకు కాని
నీ మాట వినబడగానే
అడవిలోని కుందేలు పిల్లనయ్యాను
తెలియనితనం సంచి నిండుగా నింపుకున్నాను
కాసేపు
ఎగిరే తెలివిలేని పక్షి నయ్యాను
స్వేచ్ఛ అంటే ఏంటో మర్చిపోయాను
మనసంతా
ఇంద్రధనస్సును మించిన రంగులతో నిండిపోయింది
ఇక
తెలియనితనంతో
బందీగా నీ వాకిట నిలవాలనిపించింది
ఓయ్.. రాకుమారా
అడిగింది చాల్లే
ఎలా ఉన్నానో కూడా చెప్పు మరి