నువ్వు నేను
ఓ సాయంకాలం షికారుకు వెళ్దామా
తెలియని
దారిలో కాసేపు కలిసి నడుద్దామా
పోట్లాడుకునే
విషయాలు ఎన్నెన్ని ఉన్నాయో లేక్కేలేద్దామా
కనబడని సమయంలో
కలబోసుకున్న ఉల్లాసాలని చెప్పుకుందామా
చెరిగిపోతున్న
జ్ఞాపకాలకు కొత్తనగిషీలు దిద్దుకుందామా
నువ్వంటే ఆకాశమంత ఇష్టమనే నా నుంచి
ఎందుకనో అంటూ ప్రశ్నించని నువ్వు
వినాల్సినవి చాలానే ఉన్నాయి
ఓయ్...
రారాదూ ... ఓ సాయంకాలం
నాలోని నిన్ను
నీకు మరింతగా పరిచయం చేస్తాను