యుగాలేవో గడిచిపోతున్నట్టుగా ఉంది
మాటలు వినిపించి చాలా కాలమైంది
అనుకోని పలకరింపు ఎదురైంది
అది పలకరింపని తెలియడానికి అరగంట పట్టింది
అందులో...
అది తెలియని వారి పలకరింపు
యుగసంధి మొదలయ్యిందనిపించింది
ఏమి జరుగుతుందో తెలియడానికి
అందరి మధ్యనే ఉన్నాననుకోడానికి
మనసు బుద్ధి అంగీకరించడం లేదు ఒకింత ...
అరే
మనిషి మాట్లాడడం ఇంకా మర్చిపోలేదు
కాస్తంత విశ్రాంతి తీసుకున్నాడేమో
విశ్రాంతి
మరీ మరీ ...ఎక్కువ కాలమైనట్టుంది
తెలిసిన మనుషులంతా కనుమరుగైనట్టున్నారు
ఏమైతేనేం...అదృష్టంగా
తెలియని పలకరింపు ఎదురైంది
కాస్తంత ఆయుష్షు ఇచ్చిపోయింది