ఓయ్...
నీ వైపు రెండు అడుగులు వేయగానే
పంతం పట్టిన వర్షం ఎదుట నిలిచింది చూడు
వెనకడుగు వేయమని పోరు పెడుతుంది చూడు
ఏదో
ఒక మాయనో మంత్రమో వేయకూడదూ
చుక్కైనా రాల్చకుండా కట్టుబడిపోయేట్టు
నా దారికి అడ్డు రాకుండా ఉండేట్టు
లేదంటే....
నన్ను కట్టిపడేసిన మాటలు
ఓ రెండు దానికీ చెప్పవోయ్
అది కూడా ... అచ్చంగా
నేనై పోతుందిక...