కాస్తంత మెచ్చుకోకూడదు

ఎందుకో
ఈరోజు ఏ పని చేసినట్లుగా లేదు
సమయాన్నంతా అరచేతిలో వేసుకొని
క్షణానికి ఎన్నో క్షణాలను కలుపుతూ తీసేస్తూ
గందరగోళపు లెక్కలతో
తెలియని మనుషులను ముడివేస్తునట్లున్నాను

పలకరింపుల గుర్తులన్ని చెరిగిపోయినట్లున్నాయి
మాట్లాడిన మాటలకు ఆనవాలే కనిపించట్లేదు
దుఃఖం సంతోషం అంతా ఒకటిగానే ఉంది

ఏ అనుభూతికి ఏ పదం వాడాలో బహుశా మర్చిపోయినట్లున్నాను
కాస్తంత తెలియని వెలితి ఏదో వచ్చి చేరినట్లుంది

ఓయ్
ఈ సమయానికి
దేవతనో రాక్షసినో తెలియదు కాని
నిక్కముగా నీ దానినని తెలుసుకదోయ్

వచ్చి
కాస్తంత మెచ్చుకోకూడదు

కాస్తంత మెచ్చుకోకూడదు

 

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!