ఒంటరిగా ఉన్నప్పుడు
యాతన, వేదన దరిచేరినపుడు
నువ్వే గుర్తొస్తావు
నువ్వేమైన నా దుఃఖానివా...
నలుగురితో ఉన్నప్పుడు
నవ్వుల్లో మునిగినపుడు
నువ్వు మరింత గుర్తొస్తావు
నువ్వే నా సంతోషానివా...
కరిగిపోయిన కాలానికి
తరిగిపోని నేటి సమయానికి
ఆనవాలుగా నీవే ఉంటావే
ఓయ్..
జీవితం అంటే ... నువ్వే కదూ